ఘోష ఆసుపత్రిలోని ఇన్‌పేషెంట్ రిజిస్ట్రేషన్ విభాగంలో ఓ ఉద్యోగి బర్త్ సర్టిఫికెట్ల సవరణకు వచ్చే వారి వద్ద లంచం తీసుకుంటున్నాడు. ఒక వ్యక్తి తన కుమారుడి సర్టిఫికెట్‌లో తప్పు సరిదిద్దేందుకు వెళితే రూ.500 తీసుకున్నాడు. మరో మహిళ నుంచి కూడా రూ.500 వసూలు చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే వారాల తరబడి తిప్పుకుంటున్నారని బాధితులు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ పద్మజ బుధవారం తెలిపారు.