ఆదివారం విజయనగరం 36వ డివిజన్‌లో తెదేపా బలోపేతం దిశగా పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. వైకాపా మాజీ కార్పొరేటర్ బాలి పద్మావతి, బాలి కృష్ణారావు, వార్డు ప్రధాన కార్యదర్శి ఎర్ర చిన్నారావు, నాయకులు మజ్జి చంద్రశేఖర్, ఎర్రాజీ పృథ్విరాజ్‌తో పాటు సుమారు 200 కుటుంబాలు ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో తెదేపాలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ పాలనతో ఆకర్షితులై ప్రజలు చేరుతున్నారని, కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.