విజయనగరం పోలీస్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి పాటలకు చిన్నారులు చేసిన నృత్యాలు, ఓ చిన్నారి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో NYKS వాలంటీర్లు, NSS, NCC, కాలేజీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటిచెప్పారు.