విజయనగరం జిల్లాలో ఈ నెల 8వ తేదీ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. రాబోయే నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్న వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. తగినంత నీరు తాగడం, ఎండ నుంచి రక్షణ చర్యలు పాటించడం అవసరమన్నారు. 8వ తేదీ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశముందని వెల్లడించారు.