వీరఘట్టం మండలంలో జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) సోమేశ్వరరావు (32) విద్యుత్ స్తంభంపై పనులు చేస్తూ కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా, బ్రెయిన్డెడ్తో సోమవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. చాకలిగూడకు చెందిన సోమేశ్వరరావు తెట్టంగిలో విధులు నిర్వర్తిస్తున్నారు. అతని భార్య ఐశ్వర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ కృష్ణంనాయుడు తెలిపారు. రెండేళ్ల కుమారుడున్న సోమేశ్వరరావు తల్లిదండ్రులు, పుట్టెడు దుఃఖంలోనూ కుమారుడి అవయవదానానికి అంగీకరించారు.