కార్తీక పౌర్ణమి: మరడాo శివాలయంలో భక్తుల రద్దీ
దత్తిరాజేరు మండలం మరడాo గ్రామంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయం భక్తులతో కిటకిటలాడింది. మహిళలు పిండి వంటలు చేసి, సాయంత్రం చంద్రునికి పళ్ళు కాయలు సమర్పించి, కేదారేశ్వర వ్రతమాచరించి, శివాలయాలకు వెళ్లి ముక్కులు తీర్చుకున్నారు. భక్తిశ్రద్ధలతో 'ఓం నమశ్శివాయ' నామస్మరణతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
