దత్తిరాజేరు మండలం మరడాo గ్రామంలో బుధవారం కార్తీక పౌర్ణమి పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. మహిళలు ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసాలు పాటించి, ఇంటింటా పెసర నోము బూరెలు వంటి వంటకాలు సిద్ధం చేసుకున్నారు. సాయంత్రం ఆరుబయట రోలు పూజ చేసి, చంద్రుడికి పళ్ళు, కాయలు సమర్పించారు. అనంతరం కేతారేశ్వర కథను శ్రద్ధగా ఆలకించి, శివాలయ దర్శనం చేసుకున్నారు. చివరగా, ఉపవాసం విరమించి, అందరూ సంతోషంగా నోము బూరెలు ఆరగించారు.