కొత్తవలస:లారీ ఢీకొని యువకుడు మృతి

0చూసినవారు
కొత్తవలస:లారీ ఢీకొని యువకుడు మృతి
కొత్తవలస పరిధిలోని అద్దానపాలెం సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాతసుంకరపాలెం గ్రామానికి చెందిన గనిశెట్టి నాగేశ్వరరావు (35) ప్రైవేట్ బ్యాంకులో రుణ విభాగంలో పనిచేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం కొత్తవలసలో కేక్ కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై ఇంటివైపు వెళ్తుండగా, శీతలపానీయాల గిడ్డంగి దిశగా వెళ్తున్న లారీ ఆయనను ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ షణ్ముఖరావు సిబ్బందితో వచ్చి పరిస్థితిని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్