అలమండ వద్ద లారీ బోల్తా..

4చూసినవారు
అలమండ వద్ద లారీ బోల్తా..
శుక్రవారం రాత్రి జామి మండలం అలమండ గ్రామ శివారులో తమిళనాడు నుంచి విజయనగరం వెళుతున్న కంటైనర్ లారీ అదుపుతప్పి మెయిన్ రోడ్డుపై బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. లారీ రహదారికి అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జేసీబీ సహాయంతో లారీని పక్కకు తొలగించిన తర్వాతే వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి.

సంబంధిత పోస్ట్