విజయనగరం జిల్లా కొత్తవలసలో శుక్రవారం తెల్లవారుజామున రైల్వే ట్రాక్ దాటుతుండగా ట్రైన్ ఢీకొనడంతో నెట్టి నారాయణరావు (36) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తుమ్మకాపల్లి పంచాయతీ ఒడ్డి పేటకు చెందినవాడని, అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని రైల్వే అవుట్ పోస్ట్ ఎస్‌ఐ ఎస్.వి.ఎస్.రావు తెలిపారు.