విజయనగరంలోని వైష్ణవ వీధిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 43 ఏళ్ల నాయుడు ప్రసాద్ మృతి చెందారు. తన సోదరితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.