అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

7చూసినవారు
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
విజయనగరం అయ్యన్నపేటలో అనుమానాస్పద స్థితిలో టి.గోవింద (46) అనే వ్యక్తి మృతిచెందాడు. మద్యానికి బానిస కావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. సోమవారం అతని గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అతను విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని మహారాజా ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.