మెంటాడ మండలం కొండపర్తి బాడవకు చెందిన కొండమ్మ కుమారుడు జనార్దన (3 నెలలు) చికిత్స పొందుతూ విశాఖ కేజీహెచ్ లో మృతి చెందాడు. గత నెల 26న పొట్ట, కాళ్లు, చేతులు వాపుతో గజపతినగరం, విజయనగరం ఘోషాసుపత్రిలో చికిత్స పొంది, అనంతరం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 28న మృతి చెందాడు. మెంటాడ పీహెచ్సీ వైద్యాధికారిణి లోకప్రియ తెలిపిన వివరాల ప్రకారం, కేజీహెచ్ వైద్యుల నివేదికలో ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని కోమాలోకి వెళ్లడమే మృతికి కారణమని పేర్కొన్నారు.