
భారత సైనిక పరాక్రమంతో పాక్ రక్షణ వ్యవస్థలో మార్పులు
భారత సైనిక పరాక్రమం ధాటికి పాకిస్థాన్ తన రక్షణ వ్యవస్థనే మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పుణెలో జరిగిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్లో తెలిపారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రభావంతో పాకిస్థాన్ తన రాజ్యాంగానికి సవరణలు చేసుకోవాల్సి వచ్చిందని, ఇది భారత్ సాధించిన వ్యూహాత్మక విజయమని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ 'చైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ' పదవిని రద్దు చేసి, 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్' (CDF) అనే కొత్త పోస్టును సృష్టించిందని, ఇది వారి 'లాండ్ సెంట్రిక్' ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన విమర్శించారు.




