విజయనగరం సమాచార శాఖలో నూతన సంవత్సర వేడుకలు

417చూసినవారు
విజయనగరం సమాచార శాఖలో నూతన సంవత్సర వేడుకలు
విజయనగరం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సహాయ సంచాలకులు పి.గోవిందరాజులు కేక్ కట్ చేసి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖః శాంతులతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్