గురువారం విజయనగరం కోట జంక్షన్ వద్ద
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత
ఎన్టీఆర్ అని, ప్రజల సంక్షేమం కోసం ఆయన అమలు చేసిన పథకాలు చిరస్మరణీయమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పీవీజీ కుమార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.