మహిళలపై నేరాల నియంత్రణకు "ఆపరేషన్ దండయాన

0చూసినవారు
మహిళలపై నేరాల నియంత్రణకు "ఆపరేషన్ దండయాన
మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు "ఆపరేషన్ దండయాన"ను అమలు చేస్తున్నట్లు SP దామోదర్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, అత్యాచారాలు, పోక్సో, గృహహింస కేసుల్లో నిందితులపై నిఘా, వేగవంతమైన దర్యాప్తు, శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 2025లో మహిళలు, బాలలపై జరిగిన 42 కేసుల్లో నిందితులకు శిక్షలు పడగా, 2026లో ఇప్పటి వరకు 20 కేసుల్లో శిక్షలు పడ్డాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్