విజయనగరం జిల్లాలో ఉద్యాన పంటల సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరి కంటే ఉద్యాన పంటల ద్వారా రైతులకు ఎక్కువ లాభాలు వస్తాయని, జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేసి, సాగునీటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.