వాయుగుండం ప్రభావంతో శుక్రవారం విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. బొబ్బిలి, రామభద్రపురం, రాజాం, మెరకముడిదాం తదితర మండలాల్లో తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. వర్షం కారణంగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. వర్షం చెరకు, కూరగాయలు పంటలకు అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.