రామభద్రపురం మండలం కొట్టక్కి చెకో పోస్టు వద్ద శనివారం 15.765 కిలోల గంజాయితో 8 మంది యువకులను అరెస్టు చేసినట్లు సీఐ నారాయణరావు, ఎస్సై ప్రసాదరావు తెలిపారు. పార్వతీపురం, సాలూరు, వంగర, రాజాం ప్రాంతాలకు చెందిన ఈ యువకులు ఒడిశాలోని సుంకిలో గంజాయి కొనుగోలు చేసి, మూడు ద్విచక్రవాహనాల్లో తరలిస్తుండగా పట్టుబడ్డారు. వీరితో పాటు మరో ఏడుగురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. యువకులు గంజాయి తాగడంతో పాటు అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నట్లు తేలింది. మూడు ద్విచక్రవాహనాలు, 6 చరవాణులు, రూ. 1,600 నగదు స్వాధీనం చేసుకున్నారు.