బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష: VZM SP

4చూసినవారు
బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష: VZM SP
బాడంగికి చెందిన V.వెంకటరమణ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై 2024 డిసెంబర్‌లో పోక్సో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో, శుక్రవారం కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ వివరాలను SP దామోదర్ తెలిపారు.