సోమరాజుపేట గ్రామంలో 1,500 మంది జనాభా ఉన్నప్పటికీ, దహనసంస్కారాల కోసం స్థలం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గ్రామ చెరువులోనే అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, శ్మశానానికి స్థలం కేటాయించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.