దత్తిరాజేరు మండలం మరడాo గ్రామంలో మంగళవారం ఉదయం గ్రామ సర్పంచ్ పోతల శంకర్రావు ఆధ్వర్యంలో పలుచోట్ల పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కార్తీక పౌర్ణమి పండగ స్నానాలకు, దీపాలు వదిలేందుకు అవాంతరాలుగా ఉన్న జంగిల్ తొలగింపు, శివాలయానికి వెళ్ళే దారిలో పేరుకున్న చెత్త తొలగింపు వంటి కార్యక్రమాలు చేశారు. ఈ పారిశుద్ధ్య పనులపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.