బొబ్బిలి: అంగన్వాడి సెంటర్ లో సంక్రాంతి సంబరాలు

70చూసినవారు
బొబ్బిలి: అంగన్వాడి సెంటర్ లో సంక్రాంతి సంబరాలు
బొబ్బిలి ఐసిడిఎస్ పిఓ జె. విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్వామివారి వీధిలోని రెండు అంగన్వాడీ సెంటర్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా శుక్రవారం నిర్వహించారు. పిల్లలు వివిధ రకాల వేషధారణలు ధరించి, పిండి వంటలతో ఈ వేడుకలను అందరితో కలసి జరిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, హెల్పర్లు, పిల్లలు మరియు తల్లులు పాల్గొని ఆనందంగా సమ్మిళితమయ్యారు.

సంబంధిత పోస్ట్