సంతకవిటి మండలం బూరాడ పేటలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులు ఊడి, గోడలు దెబ్బతినడంతో పాటు తుఫాన్ ప్రభావంతో ప్రాంగణం బురదమయమైంది. దీంతో ఉపాధ్యాయులు ఆవరణలో పరదాలు పరిచి చెట్టు కిందనే తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు, అధికారులను కోరుతున్నారు.