విజయనగరంలోని JNTU-గురజాడ యూనివర్సిటీలో శుక్రవారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రెండో సంవత్సరం EEE విద్యార్థి ఉదయ్ వెంకటతేజ వసతి గృహంలో ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న ఇతర విద్యార్థులు వసతి గృహ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరి పరిసరాలను పరిశీలించి ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఇతర విద్యార్థులను విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.