విజయనగరం జిల్లాలో ఇంధన వదంతులను అరికట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, ఎస్పీ ఏ. ఆర్. దామోదర్ సోమవారం పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాలకు మాత్రమే పెట్రోలు నింపాలని, డబ్బాలు, క్యాన్‌లలో విక్రయించరాదని నిర్వాహకులకు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.