రైతుల కష్టాలపై కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలి: బొత్స

0చూసినవారు
మొంథా తుఫానుతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే అండగా నిలవాలని వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కోరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, సీఎం, మంత్రులు మాటలు చెబుతున్నారే తప్ప, చేతల్లో చూపించడం లేదని విమర్శించారు. బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లించి ఉంటే, రైతుల నష్టాన్ని పూర్తిగా భర్తీ చేసేవారని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి రైతుల ఇబ్బందులు కన్పించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్