విజయనగరంలో సుమారు ఇరవై మంది హిజ్రాలు శ్రీవిజయసాగర దుర్గా మల్లేశ్వర ఆలయాన్ని నిర్మించి, పూజలు నిర్వహిస్తున్నారు. 2008 నుంచి పండితుల వద్ద శిక్షణ పొంది అర్చకులుగా సేవలందిస్తున్న వీరు, తమ సంపాదనలో 90 శాతాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నారు. రోజూ రాత్రి 7.30 గంటలకు 200-300 మంది అనాథలకు అన్నదానం చేస్తూ సమాజ సేవ చేస్తున్నారు. ఆలయ నిర్వహణతో గుర్తింపు, గౌరవం దక్కుతోందని అర్చకులు స్రవంతి, మీనా తెలిపారు. ఇక్కడ టిక్కెట్లు, టోకెన్లు ఉండవని వివరించారు.