విజయనగరం జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం

999చూసినవారు
విజయనగరం జిల్లాలో గురువారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాలలో చిరుజల్లులు కురుస్తున్నాయి. బుధవారం వరకు తీవ్రమైన ఎండలు ఉండగా, గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులు వీస్తున్నాయి. పిడుగులు, గాలులతో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్