పూసపాటిరేగ (M) పేరాపురం వద్ద హైవేపై అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. విశాఖకు చెందిన ఇరిగేషన్ కాంట్రాక్టర్ శ్రీనివాసరావు, కె.సింహాచలం, సామంతుల రమేశ్‌తో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.