రీ-నీట్ 2026 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

1చూసినవారు
రీ-నీట్ 2026 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
రీ-నీట్ 2026 ప్రవేశ పరీక్షను జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. జిల్లాలోని ఏడు పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. పరీక్షార్థులు తప్పనిసరిగా రెండు గంటల ముందే కేంద్రాలకు చేరుకోవాలని, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు డీఆర్‌వో సత్తిబాబు తెలిపారు.

ట్యాగ్స్ :