గంట్యాడలో విషాదం

గంట్యాడ మండలంలోని పొల్లంకి గ్రామంలో మంగళవారం బతుకుదెరువు కోసం మండుటెండను లెక్కచేయకుండా ఉపాధి పనులు చేస్తున్న సిరివూరి సన్యాసిరాజు అనే వ్యక్తి కర్రివాని చెరువులో పనిచేస్తుండగా అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందాడు. తోటి వేతనదారులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ, అప్పటికే అతను మరణించినట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
