విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం, సంతకవిటి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2020లో జరిగిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితులైన వెంపటాపు గోపి, కొప్పల రామినాయుడులకు న్యాయస్థానం శిక్ష విధించింది. బాధితుడిని కులం పేరుతో అవమానించి దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తిచేశారు. దీంతో కోర్టు ఇద్దరికి నాలుగేళ్ల ఆరునెలల జైలు శిక్షతో పాటు రూ. 12, 000 జరిమానా విధించింది.