విజయనగరం: బాలల హక్కుల పరిరక్షణ, బాధ్యతలపై అవగాహన పెంచాలి

74చూసినవారు
విజయనగరం: బాలల హక్కుల పరిరక్షణ, బాధ్యతలపై అవగాహన పెంచాలి
బాలల హక్కుల పరిరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన పెంచాలని జిల్లా పోలీస్ ముఖ్య సలహాదారు వై పరశురాం అన్నారు. ఆదివారం కేఎల్ పురంలో ఏపీ జి ఈ ఏ జిల్లా కన్వీనర్ కంది వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన బాలల హక్కుల పరిరక్షణ వేదిక లో ఆయన పాల్గొన్నారు. నిత్యం బాల బాలికలపై ఆకృత్యాలు పెరుగుతున్నాయని, రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థల ముందుకు రావాలని కోరారు. రాష్ట్ర సలహాదారు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్