విజయనగరం: బిల్ స్టాప్ (డమ్మీ) మీటర్లతో బురిడీ

0చూసినవారు
విజయనగరం: బిల్ స్టాప్ (డమ్మీ) మీటర్లతో బురిడీ
విజయనగరం జిల్లా విద్యుత్ శాఖలో 'బిల్ స్టాప్' (డమ్మీ) మీటర్ల పేరుతో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఓ ఉద్యోగి ఒక్కో మీటరును రూ.10,000-రూ.15,000 చొప్పున విక్రయిస్తూ సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ మీటర్లు అమర్చుకుంటే కరెంట్ వాడకం ఎంత ఉన్నా బిల్లు '0' వస్తుందని సమాచారం. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ వ్యాపారం సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఈఈ త్రినాథరావు బుధవారం తెలిపారు.