గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు నియామకాన్ని సీఎం చంద్రబాబు సోమవారం అభినందించారు. ఇది ఆంధ్ర ప్రజలకు గర్వకారణమని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా, ఆషిమ్ ఘోష్ హర్యానా గవర్నర్‌గా, కవీందర్ గుప్తా లడాఖ్ లెఫ్టెనెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు.