విజయనగరం: ఆటో ఢీకొని వృద్ధుడి మృతి

5చూసినవారు
విజయనగరం: ఆటో ఢీకొని వృద్ధుడి మృతి
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ఎం. సింహాచలం (65) గురువారం రాత్రి మధురవాడలోని ధర్మపురి కాలనీలో రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొని మృతి చెందాడు. ఆరేళ్ల క్రితం జీవనోపాధి కోసం మధురవాడకు వచ్చి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఆయన, కారు షెడ్డు కూడలి వద్ద ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్