ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పెదమజ్జి సత్యనారాయణ, యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పి. భానుమూర్తి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటాలు చేస్తోందన్నారు.