విజయనగరం పాల్ నగర్ చెందిన ఆర్. సహజ మెస్సి ఇవాంజలీన్ గ్రూప్1 ఫలితాల్లో సత్తాచాటారు. జిల్లా ఉపాధి అధికారిణిగా ఎంపిక కావడం పట్ల తల్లితండ్రులు ఆర్ఏఎస్ కుమార్, శోభారాణి ఆనందించారు. ఈమె ప్రస్తుతం డెంకాడ మండలంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తండ్రి కుమార్ ఎస్ఎస్ఏ అకౌంట్ ఆఫీసర్‌గా, తల్లి శోభారాణి బొండపల్లి ఎంఈఓ-1విధులు నిర్వర్తిస్తున్నారు. మెస్సికి తల్లితండ్రులు, బంధువులు అభినందనలు తెలిపారు.