విజయనగరం: కార్యకర్తలతో భోజనం చేసిన ఎమ్మెల్యే

3చూసినవారు
విజయనగరం: కార్యకర్తలతో భోజనం చేసిన ఎమ్మెల్యే
విజయనగరం జిల్లా కేంద్రం, బొబ్బిలి, ఎస్.కోట నియోజకవర్గాల్లో రెండో రోజు మహానాడు కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. విజయనగరంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోట వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్లస్టర్ స్థాయి మహానాడు ప్రాంగణంలో నాయకులు, కార్యకర్తలకు ఆమె అల్పాహారం వడ్డించి, వారితో కలిసి తిన్నారు. ఎస్ కోటలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొబ్బిలిలో ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.