విజయనగరం: వైభవంగా ముక్కోటి ఏకాదశి పూజలు

70చూసినవారు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించుకునేందుకు దేవాలయాల్లో బారులు తీరారు. విజయనగరం టౌన్ సెంటర్లో ఉన్న శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో భక్తుల రద్దీతో దైవదర్శనానికి భక్తజనం బారులు తీరారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కుటుంబ సమేతంగా స్వామి దర్శనాలు చేసుకుంటుంన్నారు.

సంబంధిత పోస్ట్