భీమిలి రాజుల తాళ్లవలసకు చెందిన 87 ఏళ్ల దాట్ల సూర్య అప్పలరాజు మరణానంతరం తన శరీరాన్ని వైద్య విద్యకు అప్పగించాలన్న కోరికను ఆయన కుమార్తె పూసపాటి రమాదేవి నెరవేర్చారు. మంగళవారం అప్పలరాజు మృతి చెందడంతో, ఆయన మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వైద్య పరిశోధనల కోసం అప్పగించారు. అంతేకాకుండా, తండ్రి రెండు కార్నియాలను రెడ్ క్రాస్ ఐ బ్యాంకుకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు.