విశాఖ జిల్లా దాకమర్రి జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బైక్ నిలిపి మాట్లాడుతున్న ఇద్దరు యువకులను విశాఖ నుంచి VZM వెళ్తున్న కారు ఢీకొట్టింది. అదే వేగంతో రోడ్డు దాటుతున్న మరో ముగ్గురిపైకి దూసుకెళ్లడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు VZMలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. కారు డ్రైవర్ పరారైనట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.