విజయనగరం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో ఖాళీగా ఉన్న రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఈనెల 9న రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి బబిత తెలిపారు. పరీక్షలు మోతీ మహల్, ఎం.ఆర్.కాలేజీ (విజయనగరం కోట)లో జరుగుతాయి. హాల్ టికెట్ అందని వారు జిల్లా కోర్టు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని, అభ్యర్థులు గంట ముందే హాజరు కావాలన్నారు.