ఈనెల 14న జరగనున్న యోగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా నిర్వహించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. యోగా చేయాలి అనుకునే వారంతా 1800-315-7008 నంబరుకు మిస్డ్‌కాల్ ఇచ్చి పేరు నమోదు చేసుకుని నెలివాడ అంకన్న చెరువు వద్ద జరిగే థీమాటిక్ యోగాలో భాగస్వాములు కావాలని కోరారు. యోగాపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.