రాజకీయాల్లోకి విజయసాయి రెడ్డి.. ఆ జిల్లా నుంచే రంగంలోకి?

30చూసినవారు
రాజకీయాల్లోకి విజయసాయి రెడ్డి.. ఆ జిల్లా నుంచే రంగంలోకి?
AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి శ్రీకాకుళం జిల్లా నుంచి కొత్త రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడతారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. విజయసాయి రెడ్డి ఇటీవల శ్రీకాకుళంలో రెడ్డి సామాజిక వర్గ సంక్షేమ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. శ్రీకాకుళం కేంద్రంగా ఆయన రాజకీయ యాత్రను మొదలు పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్