రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి రీఎంట్రీ.. క్లారిటీ

52చూసినవారు
రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి రీఎంట్రీ.. క్లారిటీ
AP: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన మళ్లీ వైసీపీలో చేరబోతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. అయితే రాజకీయ పునఃప్రవేశంపై విజయసాయిరెడ్డి బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నా రాజకీయ పునః ప్రవేశం, భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాను. నాది స్వతంత్ర భావజాలం. ఎలాంటి ఒత్తిళ్లకూ, ప్రలోభాలకు, ప్రభావాలకూ లోనుకాకుండా నిర్భయంగా రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఆత్మగౌరవంతో నిర్ణయం తీసుకుంటాను’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్