పెట్రోల్ దాడి.. తల్లి, కుమారుడు మృతి

2096చూసినవారు
పెట్రోల్ దాడి.. తల్లి, కుమారుడు మృతి
వికారాబాద్ జిల్లాలో ఆస్తి తగాదాల నేపథ్యంలో జరిగిన పెట్రోల్ దాడి ఘటనలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం (మార్చి 24) రూప్ సింగ్ తాండా సర్పంచ్ రమణి భాయ్ కుటుంబంపై అనార్ సింగ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో కొడుకు వెంకటేష్ మృతి చెందగా, గాయపడ్డ తల్లి రమణిబాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కొడుకు అంత్యక్రియలు పూర్తైన వెంటనే తల్లి అంత్యక్రియలు జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్