వికసిత్ భారత్ జీరామ్ జీ పథకాన్ని అమలు చేయాలి: చంద్రబాబు
AP: పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా వికసిత్ భారత్ జీరామ్ జీ పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వీబీ జీరామ్ జీ పథకంపై ప్రజలకు, లబ్దిదారులకు వివరించేలా కార్యాచరణ సిద్దం చేయాలని సూచించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జనసేన తరఫున మంత్రి కందుల దుర్గేష్‌తో భేటీ అయ్యారు. ఇప్పటివరకు నరేగా పనుల్లో టీడీపీ హయాంలో మాత్రమే ఆస్తుల కల్పన జరిగిందన్నారు.
